అమరావతి బ్రహ్మణ సేవా సంఘం :
అమరావతి బ్రహ్మణ సేవా సంఘం ఆవిర్భావ సత్సంకల్ప ఆలోచనను కార్య రూపమును దాల్చి శ్రీ కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామివారి ముందు ఉంచటం జరిగినది , శ్రీ మహా స్వామి వారు మన సంఘము నకు మంగళా శాసనములు అందించి , మన సంఘమును దిన దిన ప్రవర్ధమానముగా అభివృద్ధి చెందవలెనని వారి ఆశీస్సులు అందించారు .
శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారు కూడా మన సంఘము నకు మంగళా శాసనములు అందించి వారి ఆశీస్సులు అందించారు.
ది . 26.03.2023 వ తేదీ విజయవాడ మధ్య నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు వర్ధన్ గారి చేతుల మీదుగా మరియు పురప్రముఖుల సమక్షంలో వైభవోపేతముగా ప్రరంభించబడినది .
శ్రీ దమ్మాలపాటి లీలా ప్రసాద్ మరియు చంద్ర శేఖర్ గార్లు (ధర్మ కర్తలు శ్రీ భువనేశ్వరి పిఠ పరిపాలిత శ్రీ సీతారామ కల్యాణ మండపం) మన సంఘమునకు వెన్ను దన్ను గా నిలిచి శ్రీ భువనేశ్వరి పీఠ పరిపాలిత శ్రీ సీతారామ కళ్యాణమండపము నందు మన సంఘమునకు కార్యాలయమును ఏర్పాటుచేసి నారు వారు అందించిన సహకారము కరతలామరకము .
అనతి కాలములోనే మన సంఘము ద్వారా నిరాటంకముగా , నిర్విరామముగా ఉచిత వివాహ పరిచయ వేదికలు , బీద బ్రహ్మణ విద్యార్థులకు పుస్తకములు పంపిణి చేయుట , ఉచిత వైద్య శిబిరములు , కార్తీక వన సమారాధన, శ్రీ గణపతి నవ రాత్రలు , మహిళలకు సంక్ర0తి ముగ్గుల పోటీలు, మహా శివరాత్ర వేడుకలు ఇత్యాది అనేక సేవా కార్యక్రమములు మన జీవిత సభ్యులు మరియు బ్రహ్మణ బంధువులు , హితులు , సన్నిహితులు అందించిన సహాయ సహకారములతో జరిపించి యున్నాము .
నేటి సమాజ స్థితిగతులకు అనుగుణముగా యువతను ఆకర్షించే విధముగా అనేక కొత్త సేవలను ప్రవేశపెట్టడం జరిగినది , సాంకేతిక మరియు సాంఘిక మాద్యమాలద్వారా , ఫేసుబుక్ , ఇంస్టాగ్రామ్ మరియు ఇమెయిల్ ద్వారా మన సేవ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేరవేయుచు ప్రజల మన్ననలు పొందుతున్న సేవా సంస్థ .
స్థాపించిన అనతికాలంలోనే అనేక మంది బ్రహ్మణ బంధువులు మన సంఘములో జీవిత సభ్యులుగా చేరి మన సంఘము యొక్క సంఘటితమును మరియు ఔన్నత్యమును తెలియజేసినారు
బ్రహ్మణ సమాజ శ్రేయస్సును కోరుకునే అనేక సేవ సంఘములు మన విజయవాడ నందు కొనసాగుతూ వారి వారి సేవలను అందించుచున్నప్పటికీ మన అమరావతి బ్రాహ్మణ సేవా సంఘము కార్యవర్గ సభ్యుల పరస్పర సహకారము మరియు అకుంటిత దీక్ష వలన అనతికాలంలోనే చేపట్టిన సేవ కార్యక్రమముల వలన ప్రజలకు చేరువ కాగలిగినది . విజయవాడ పుర బ్రాహ్మణ ప్రముఖులు మన సంఘమునకు అన్నివిధాలా సహాయ సహకారములు అందించి , ప్రత్సహించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనములు .
To build/run an organization catering to the needs of the Brahmin Community:
This indicates the intention to create or manage an institution that specifically addresses the requirements and concerns of the Brahmin community. This could involve various aspects such as cultural, social, educational, or economic needs unique to the Brahmin demographic.
Dedicate the organization to the service of the community:
This signifies a profound dedication to serving the Brahmin community. The organization’s primary purpose is to work for the betterment and upliftment of the community members, prioritizing their welfare and interests above all else.
Commit ourselves to Brahmana Dharma as the prime objective: Here, “Brahmana Dharma” refers to the principles, values, and duties traditionally associated with the Brahmin caste. This commitment implies aligning the organization’s activities, goals, and values with those of Brahmin Dharma, which may include upholding spiritual, moral, and ethical standards, as well as promoting cultural heritage and knowledge associated with the Brahmin community.